Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాష్ట్రపతి ప్రణబ్ పర్యటన ఎఫెక్ట్... పోలీసు చక్రబంధంలో యాదగిరిగుట్ట క్షేత్రం

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నేడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో యాదగిరిగుట్ట ఆలయాన్ని పోలీసు బలగాలు పూర్తిగా తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. నిన్న రాత్రికే గుట్టపై భక్తులను పోలీసులు ఖాళీ చేయించేశారు. నేటి మధ్యాహ్నం దాకా గుట్ట ఆలయంలో స్వామివారి దర్శనం, ఇతర సేవలన్నీ బందయ్యాయి. గుట్టపై ఉన్న దుకాణాలను కూడా పోలీసులు మూసివేయించారు. దీంతో ప్రస్తుతం గుట్ట పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.

More Telugu News